Last Updated:

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్పీఎస్సీ ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ యాదయ్య, వై.రామ్మోహన్ రావులను ప్రభుత్వం నియమించింది.

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా  మహేందర్ రెడ్డి

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్పీఎస్సీ ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ యాదయ్య, వై.రామ్మోహన్ రావులను ప్రభుత్వం నియమించింది.

టీఎస్పీఎస్సీ పై ప్రత్యేక దృష్టి..(TSPSC)

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ అప్రతిష్టపాలయింది. ప్రశ్నా పత్రాలు లీక్ అవడం, పరీక్షల నిర్వహణలో పలు విమర్శలు వచ్చాయి.ఇది ఒక విధంగా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పై దృష్టి సారించారు. ఛైర్మన్, సభ్యుల నియమాకం గురించి గవర్నర్ తమిళిసై తో చర్చించారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లినపుడు యూపీఎస్సీ ఛైర్మన్ ను కలిసి అక్కడ పద్దతులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ క్యాలెండర్ అమలు తీరు గురించి చర్చించారు. ఈ నేపధ్యంలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా సమర్దుడైన అధికారిని నియమించాలని భావించారు. ఛైర్మన్ పదవికోసం సుమారుగా 50 మంది దరఖాస్తు చేసుకోగా చివరకు మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసారు.

మహేందర్ రెడ్డి స్వస్దలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టారం గ్రామం. 1986 బ్యాచ్ కు చెందిన మహేందర్ రెడ్డి రామగుండం ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించి తెలంగాణ డీజీపీ గా పదవీ విరమణ చేసారు. తన కెరీర్ లో నిజామాబాద్, కర్నూలు ఏఎస్పీగా, సైబరాబాద్ కమీషనర్, హైదరాబాద్ కమీషనర్ గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ డీజీపీగా 2017 నుంచి 2022 వరకు పనిచేసారు.