Ex Mister Harish Rao : దుబాయ్ టూర్‌పై రేవంత్‌వన్నీ అబద్ధాలే : మాజీ మంత్రి హరీశ్‌రావు

Ex Mister Harish Rao : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేసి, 11 కిలోమీటర్లు తవ్వినట్లు వెల్లడించారు. దీనిపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానని చెప్పారు. తప్పని నిరూపిస్తే రాజీనామాకు చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని ముఖ్యమంత్రి అంటున్నారని, తన మిత్రుడి కూతురు వివాహానికి వెళ్లినట్లు చెప్పారు. తాను ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్తే, మరుసటి రోజు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగిందని గుర్తుచేశారు.
సీఎం రాజీనామాకు సిద్ధమా..?
ప్రభుత్వంలో మీరే ఉన్నారని, రెస్క్యూ పనులు చేయాలని సూచించారు. కానీ, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం మంచిపద్ధతి కాదన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇలాగే మాట్లాడారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా మీ వల్ల కాదని చెప్పండి.. తామే రెస్క్యూ చేసి చూపెడతామన్నారు. పది రోజులు అవుతున్నా మృతుదేహాలు ఇంకా బయటకు తీయలేదన్నారు. మృతదేహాలను బయటకు తీసిన వెంటనే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము వెళ్తే టన్నెల్ వరకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తే దగ్గరుండి చూపించారని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన విషయంలో సీఎంకు ప్రత్యేక శ్రద్ధం లేదని, అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వెళ్లారని చెప్పారు. ఈ వివిషయాలను అసెంబ్లీలో ఎండగడతామని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్‌రెడ్డిది కురచబుద్ధి..
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్‌కి జాతిపిత గాంధీ కూడా టార్గెట్ అయినట్టున్నారని విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప.. ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధామని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని విమర్శించారు.
గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్..
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఉన్న విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదని, బాపుఘాట్ పునరుద్ధరిస్తామని బడాయి కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్‌కు, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందన్నారు. నాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం.. నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహాత్మా మన్నించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.