Published On:

Upasana : ఆడపులికి ‘క్లీంకార’ పేరు.. హైదరాబాద్‌ జూపార్కుకు నటుడు రామ్‌చరణ్‌ భార్య థాంక్స్‌

Upasana : ఆడపులికి ‘క్లీంకార’ పేరు.. హైదరాబాద్‌ జూపార్కుకు నటుడు రామ్‌చరణ్‌ భార్య థాంక్స్‌

Actor Ram Charan Wife Upasana interesting Post: నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు బృందానికి ధన్యవాదాలు తెలిపారు. జూపార్కులోని ఒక ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది కింద అది కేవలం ఒక చిన్న పులి పిల్ల అన్నారు. కానీ, ఈ రోజు అది ఒక ఉల్లాసభరితమైన ఆడపులి అని చెప్పుకొచ్చారు. దానికి తమ కూతురు క్లీంకార పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్‌ జూపార్కు బృందానికి ధన్యవాదాలు చెప్పారు. వన్యప్రాణులు అడవికే సొంతమైనప్పటికీ, వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతుంటామని రాసుకొచ్చారు. క్లీంకారతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఉపాసన-క్లీంకార ఆడపులిని చూస్తూ కనిపించారు.

 

నెహ్రూ జూపార్కులోని పులి పిల్లలను గురువారం ఉపాసన దత్తత తీసుకున్నారు. తన కూతురు క్లీంకారతో కలిసి జూపార్కకు చేరుకున్నారు. జూపార్కులోని వివిధ జంతువుల ఎన్‌క్లోజర్లను వీక్షించారు. అనంతరం జూపార్కు డైరెక్టర్‌ డాక్టర్ సునీల్‌ ఎస్‌.హిరేమత్‌ను సంప్రదించి పులి పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. పులిపిల్లల పోషణకు అవసరమైన డబ్బులను చెక్కుగా డైరెక్టర్‌కు అందజేశారు. నేడు ఉపాసన కూతురు క్లీంకార పుట్టినరోజు. పాప జన్మించి రెండేళ్లు అయింది. క్లీంకార పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్‌ జూపార్కు బృందం.. జూపార్కులోని ఆడపులికి క్లీంకార పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి: