Maoists Bandh today: ఏజెన్సీలో హై అలర్ట్
Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ వంటి మావోయిస్టు నేతలు చనిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కేంద్ర బలగాలు భారీ పహారా ఏర్పాటు చేశాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పలు వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు.
కాగా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టు బంద్ కొనసాగుతోంది. దీంతో తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు చేపట్టాయి. చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడులో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మావోయిస్టులు విధ్వాంసానికి పాల్పడొచ్చని నిఘా వర్గాల సమాచారంతో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.