Bomb Threat To Hanumakonda Court: హన్మకొండ కోర్టులో బాంబులు

Six Detonators Found In Hanumakonda Court: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆగంతకులు నిత్యం ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాలు, రైళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసులు ఇలా అన్నిచోట్ల బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది.
హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఆరు డిటోనేటర్లు లభించాయి. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లాయర్లు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా కోర్టులో బాంబు పెట్టినట్టు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.