Published On:

Maganti Gopinath : జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ‘మాగంటి’పై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించిన హైకోర్టు

Maganti Gopinath : జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ‘మాగంటి’పై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించిన హైకోర్టు

Telangana High Court : జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం పిటిషన్లపై న్యాయస్థానం విచారణ ముగించింది. ఎన్నికల్లో నామినేషన్‌ సందర్భంగా గోపీనాథ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్‌ నేత అజహరుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనంలో విచారణ జరుగుతుండగా, రెండు రోజుల కింద ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతిచెందారు. విషయాన్ని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

 

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ.. తీర్పు వాయిదా
సుబేదారీ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. క్వారీ వ్యాపారి మనోజ్‌ను రూ.50లక్షలు ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి బెదిరించినట్లు మనోజ్‌ భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాజకీయ కక్షల కారణంగా కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని అతని తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు తెలిపారు. డబ్బుల కోసం బెదిరించినందుకే పోలీసులు కేసు నమోదు చేశారని పీపీ వివరించారు. విచారణ అనంతరం తీర్పు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: