Last Updated:

Beer sales: బీర్ల అమ్మకాల్లో రికార్డు.. 18 రోజుల్లో ఎన్ని బీర్లు ఖాళీ చేశారంటే?

బయట ఎండల దెబ్బకు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లడం లేదు. దీంతో రోడ్లపై రద్దీ కూడా తగ్గింది. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతొ ఎండ వేడిమి నుంచి రిలీఫ్ కోసం జనాలు కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Beer sales: బీర్ల అమ్మకాల్లో రికార్డు.. 18 రోజుల్లో ఎన్ని బీర్లు ఖాళీ చేశారంటే?

Beer sales: బయట ఎండల దెబ్బకు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లడం లేదు. దీంతో రోడ్లపై రద్దీ కూడా తగ్గింది. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతొ ఎండ వేడిమి నుంచి రిలీఫ్ కోసం జనాలు కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మే నెలలో చూస్తే కేవలం 18 రోజుల్లో 583 కోట్ల విలువైన బీర్లు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

 

మద్యం అమ్మకాల్లో బీర్లే టాప్ (Beer sales)

ఎండలు పెరిగే కొద్ది బీర్ల అమ్మకాలు​ కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. మే 1 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో బీర్లదే టాప్ ప్లేస్. కేవలం 18 రోజుల్లోనే 583 కోట్ల రూపాయలు విలువ చేసే బీర్ల అమ్మకాలు జరిగాయి. మే నెలలో పెళ్లితో పాటు ఫంక్షన్లు కూడా తెలంగాణలో బీర్ల అమ్మకాలకు కలిసొచ్చింది. రాష్ట్రంలో 2650 వైన్స్ షాప్స్ ఉండగా.. వాటి పరిధిలో 19 లిక్కర్ డిపోలు నడుస్తున్నాయి. ఇటీవల రాష్ర్టంలో లిక్కర్ రేట్లను తగ్గించినా.. సమ్మర్ లో లిక్కర్ సేల్స్ అంతగా పెరగలేదు. సమ్మర్ లో వినియోగదారులు బీర్ల వైపే మొగ్గుచూపుతున్నారు. లైట్, స్ట్రాంగ్ బీర్లు రికార్డు స్థాయిలో సేల్ అవుతున్నాయి.

మే నెల ప్రారంభం నుంచి 18 తేదీ వరకు మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను మందు బాబులు ఖాళీ చేశారు. ఈ 18 రోజుల్లో బీర్ల సేల్స్ తో సర్కారుకు రూ. 582. 99 కోట్ల ఆదాయం చేకూరింది. ఇలాగే కొనసాగితే మే చివరికి ఆదాయం 1000 కోట్లకు చేరే అవకాశం ఉంది.

టాప్ లో నల్గొండ

ఈ బీర్ల అమ్మకాల్లో రాష్ర్టంలో నల్గొండ టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో కరీంనగర్ ఉంది. నల్గొండ జిల్లాలో 3,00,364 కాటన్ల బీర్లు అమ్ముడుపోగా రూ. 48.14 కోట్ల ఆదాయం వచ్చింది. మరో వైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్ కాగా రూ. 78.42 కోట్ల ఆదాయం వచ్చింది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా ఈ 18 రోజుల్లో లిక్కర్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 904.47 కోట్ల ఆదాయం వచ్చింది.