Ponnala Lakshmaiah: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

Ponnala Lakshmaiah: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ..(Ponnala Lakshmaiah)
దీనితో మనస్థాపం చెందిన పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడుతున్నట్లు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. సీనియర్ నేతను అయినప్పటికీ పార్టీ ఆందోళనలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని పొన్నాల లక్ష్మయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలవడానికి ఢిల్లీలో 10 రోజులు వేచి ఉండాల్సి వచ్చిందని, ఒక్క నిమిషం కూడా తనకు సమయం ఇవ్వలేదన్నారు. తెలంగాణకు చెందిన 50 మంది బీసీ నేతలు ఢిల్లీకి వెళ్లి బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారని, అయితే ఏఐసీసీ నేతలు సమావేశానికి నిరాకరించారని అన్నారు. ఇది ఆత్మగౌరవం గురించి గొప్పగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిందని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పొన్నాల లక్ష్మయ్య నీటి పారుదల శాఖా మంత్రిగా పనిచేసారు. నాటి ప్రభుత్వం తలపెట్టిన జలయజ్జం పధకంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.