Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు
![Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-14.28.06.jpeg)
Rahul Gandhi Telangana Tour Schedule Cancelled: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. అయితే తొలుత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ఆయన రైలు మార్గంలో తమిళనాడు బయలుదేరేలా షెడ్యూల్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు, అయితే ఇంతలోనే ఆయన పర్యటన రద్దయింది. సాయంత్రం హనుమకొండ రావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.