Last Updated:

MLAs Defection Case: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. నోటీసులు!

MLAs Defection Case: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. నోటీసులు!

Telangana BRS MLAs Defection Case: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.

కాగా, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ వేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్.. ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లపై విచారించనున్నట్లు తెలిపారు. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.