Home / ప్రాంతీయం
: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న మాజీమంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన స్థలాన్నికొందరు ఆక్రమించుకుంటున్నారని వారు ఆరోపించారు.
టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్.. చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే
హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కిరాయి రౌడీలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు
ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే .
హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి శేషాద్రినగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారివద్ద నుంచి మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు స్థలాన్ని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయని తెలిపారు.
ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిల్చిపోయిన సంక్షేమ పథకాల నిధులు తాజగా విడుదలయ్యాయి. ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి.