Last Updated:

Suicide: టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం..సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్.. చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

Suicide: టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం..సీరియల్ నటుడు చంద్రకాంత్  ఆత్మహత్య

Suicide: టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్.. చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

పవిత్రతో ఆరేళ్లుగా సహజీవనం..(Suicide)

పవిత్రతో పాటు.. పలు సీరియల్స్ లో చందు నటించారు. చందుకు ఇంతకు ముందే భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పవిత్రతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 6 సంవత్సరాలుగా చందూ.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఒక యాక్సిడెంట్‌లొ పవిత్ర మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 2015లో శిల్ప అనే మహిళను చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.