Home / ప్రాంతీయం
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.
ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి వైసీపీ షాక్ ఇచ్చింది . జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయి పార్టీ ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది.
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు సమీకరించాలని అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మధురానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రహ్మత్ నగర్లోని బంగారు మైసమ్మగుడివద్ద ఉంటున్న శ్రీనాథ్.. పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉన్న ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
ఏపీలో బెట్టింగ్ జోరు అందుకుంది .ఒక వైపు ఐపీఎల్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి .తాజాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు ఊపు అందుకున్నాయి .సహజంగా అగ్రనేతలు పోటీ చేసే చోట్ల బెట్టింగులు ఉంటాయి .కానీ ఈ సారి అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో బెట్టింగులు జరగడంలేదు
ఒకప్పుడు అల్లర్లు అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో అంతకుమించి విధ్వంసంకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగినా తగ్గట్లేదు.