Home / ప్రాంతీయం
ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసి నిరుద్యోగ యువతి, యువకులకు అమ్ముతున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహేశ్వరం SOT, చైతన్య పురి పోలీసుల దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం 7మంది ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి చినుకులు మొదలయ్యాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ , పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) 2024 ఫలితాలు శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 1,80,424 మంది (74.98 శాతం) ప్రవేశానికి అర్హత సాధించారు.
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .
: విశాఖపట్టణం లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు . ఈ బస్సులను శనివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు.
: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో బంగారు ఉత్పత్తి కోసం జియో మైసూర్ సర్వేస్ కంపెనీ వేగం పెంచింది.ఈ ఏడాది చివరినాటికి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి పై గుత్తి మండలం బాచుపల్లి దగ్గర కారు, లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.