Home / ప్రాంతీయం
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.గత కొంతకాలంగా ధియేటర్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో వారికి ఆర్దిక ఇబ్బందులు తలెత్తడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. పరిస్దితుల్లో మార్పు వస్తే మరలా షోలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు -చిలకలూరిపేట హైవేపై.. టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో.. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు.. సుత్తి, రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌మ్యాన్‌కు గాయాలయ్యాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.
నగరాల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా విద్యాధికులు వుంటారు .ఉద్యోగాలు ,వ్యాపారాలు ,చేతిపనులు చేసుకునే వారు అధికం .అయితే పోలింగ్ రోజు మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారు .ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తంతు జరుగుతుంది.దీనితో నగర వాసులకన్నా గ్రామీణ ప్రాంత వాసులకే ఎక్కువగా రాజకీయ చైతన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.