Mother’s Last Rites: దారుణం.. ఆస్తి పంపకాల కోసం ఆగిన తల్లి అంత్యక్రియలు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
Mother’s Last Rites: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
అంత్యక్రియలు.. పెద్దకర్మ ఖర్చు కోసం..(Mother’s Last Rites)
నేరేడుచర్ల మండలం కందుల వారి గూడానికి చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు ఇదివరకే మరణించాడు. ప్రస్తుతం చిన్న కుమార్తె వద్ద ఉంటున్న లక్ష్మమ్మ ప్రమాదవ శాత్తు కాలు జారి క్రింద పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కందులవారిగూడానికి తరలించారు. అయితే లక్ష్మమ్మ వద్ద నగదు, నగలు ఉన్నాయని అవి పంచితేనే అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్పారు.లక్ష్మమ్మ దగ్గర ఇరవై ఒక్క లక్షల ఉన్నాయి. ఈ మొత్తాన్ని బయట కొందరికి వడ్డీకి ఇచ్చిందని తెలవడంతో,ఆ డబ్బులు సంగతి తేల్చాలని తర్వాతనే ఖననం చేయాలంటూ కుటుంబ సభ్యులందరూ పట్టుబట్టారు.దీనితో ఆరు లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం చిన్న కూతురుకి ఇచ్చారు…మిగిలిన 15 లక్షలు కొడుక్కి ఇవ్వాలని పంచాయతీలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.20 తులాల బంగారంను ముగ్గురు కూతుళ్లకు పంపకాలు సమానంగా జరపాలని పంచాయతీ తీర్మానం చేశారు దానికి అందరూ అంగీకరించారు.. అయితే ఆస్తి పంపకాలు కొలక్కి వచ్చినా అంత్యక్రియలు, పెద్ద దినం ఈ రెండు ఖర్చు కూడా తేలితేనే తలకొరివి పెడతానంటూ కొడుకు పట్టుబడుతున్నాడు.