Last Updated:

KCR: నన్ను పరామర్శించేందుకు ఎవరూ రావద్దు.. కేసీఆర్

పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)  ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.

KCR: నన్ను పరామర్శించేందుకు ఎవరూ రావద్దు.. కేసీఆర్

 KCR:  పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)  ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.

ఇతరులకు అసౌకర్యం..( KCR)

ఆసుపత్రికి రావద్దని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఇది ట్రాఫిక్ ను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇక్కడ వందలాది మంది రోగులకు కూడా అసౌకర్యం కలిగిస్తుంది. ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇతరుల భద్రత కూడా అంతే ముఖ్యం. దయచేసి క్రమశిక్షణతో మీ ఇళ్లకు తిరిగి వెళ్లండి. నేను రికవరీ అయ్యాక మనం కలుసుకుందామని వీడియోలో కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ 8న వాష్‌రూమ్‌లో పడిపోవడంతో కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన కోలుకునే ప్రక్రియ బాగానే కొనసాగుతోందని వైద్య నిపుణులు తెలిపారు.