IT Raids: హైదరాబాదులో కాంగ్రెస్ నేతల నివాసాల్లో ఐటీ సోదాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
IT Raids: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
సోదాల కలకలం..( IT Raids)
గురువారం తెల్లవారుజామున 5 గంటలకు పారిజాత నరసింహారెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు.. పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె భారీ మొత్తంలో నగదు నిల్వ చేసినట్లు నివేదికల ఆధారంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె రాహుల్ గాంధీని కలిసి చర్చించడం జరిగింది. ఇలా ఉండగా టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మాట్లాడుతూ మా అభ్యర్థులపై ఐటీ శాఖ దాడికి పాల్పడిందని తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒకటేనని ఇది రుజువు చేస్తుందని అన్నారు.