Kerala Doctor: కేరళ: వరకట్నం ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ అయిందని వైద్యురాలు ఆత్మహత్య
కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు వరకట్న డిమాండ్లను తీర్చలేకపోవడంతో పెళ్లి రద్దయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మహిళ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థినిగా ఉన్న షహానా మంగళవారం ఉదయం ఆమె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
Kerala Doctor: కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు వరకట్న డిమాండ్లను తీర్చలేకపోవడంతో పెళ్లి రద్దయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మహిళ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థినిగా ఉన్న షహానా మంగళవారం ఉదయం ఆమె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
వర కట్న డిమాండ్లను తీర్చలేకపోవడంతో ఆమె కాబోయే భర్త పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని షహానా బంధువులు ఆరోపించారు.అతని కుటుంబం బంగారం, భూమి మరియు బిఎండబ్ల్యు కారు రూపంలో కట్నం డిమాండ్ చేసింది. షహానా కుటుంబం వారి డిమాండ్లను నెరవేర్చలేక పోవడంతో వివాహాన్నిరద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసారు. నిందితుడు డాక్టర్ రూవైజ్‌ని బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అతను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి కూడా ఉన్నాడు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.
విచారణకు మహిళా కమిషన్ డిమాండ్ ..( Kerala Doctor)
కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సతీదేవి బుధవారం షహానా తల్లిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలపై మహిళా కమిషన్ నివేదిక కోరుతుందని, ఈ కేసుపై విచారణ జరిపించాలని సతీదేవి డిమాండ్ చేశారు.బాధితురాలి నుంచి వైద్యుడి కుటుంబం వరకట్నం డిమాండ్ చేసినట్లు తేలితే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెడతామని సతీదేవి తెలిపారు.ఈ విషయంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా స్వయంగా కేసు నమోదు చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అతనిని తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది.