Last Updated:

TDP Manifesto: మహానాడు వేదికగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.

TDP Manifesto: మహానాడు వేదికగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

TDP Manifesto: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. దీంతో మమానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ిన పూరించారు చంద్రబాబు.

 

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే.. టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుందో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో భాగంగానే మినీ మేనిఫేస్టోలోని 6 కీలక అంశాలను వెల్లడించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

 

మహిళల కోసం ‘మహాశక్తి’(TDP Manifesto)

మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని చంద్రబాబు వెల్లడించారు. 18 -59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఖాతాల్లో వేస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా ‘తల్లికి వందనం’పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పథకం అందుతుందన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నిబంధన ఎత్తి వేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని.. ఇకపై ఆ నిబంధన రద్దు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

 

యువగళం నిధి

యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. ఏపీలోని ప్రతి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు.

 

రైతు కోసం అన్నదాత(TDP Manifesto)

‘అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను అప్పులపాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతు కోసం అన్నదాత కార్యక్రమం తెస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామి ఇచ్చారు.

 

 

బీసీలకు రక్షణగా(TDP Manifesto)

తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని చంద్రబాబు తెలిపారు. బీసీలపై దాడులు జరుగుతున్నాయని.. బీసీలకు రక్షణ కోసం చట్టం తెస్తామన్నారు. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. బీసీల అభివృద్ధి తన బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇంటింటికీ మంచి నీరు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాగానే ‘ఇంటింటికీ మంచి నీరు’పథకం మొదలు పెడతామన్నారు. ఈ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇస్తామని తెలిపారు.

 

పూర్ టూ రిచ్

ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను ధనికులను చేసే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్ టూ రిచ్ పథకం కింద పేదలను సంపన్నులను చేసే విధంగా ముందడుగు వేస్తామన్నారు. సంపద సృష్టించి.. ఆ సంపదను పేదవాళ్లకు పంచుతామని తెలిపారు. రూ. 2 వేల నోట్లు రద్దు చేశారు. రూ. 500 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు.