Last Updated:

Mahanadu 2023 : రాజకీయ రౌడీలు.. ఖబడ్దార్.. జాగ్రత్త అంటూ చంద్రబాబు వార్నింగ్.. మళ్ళీ పూర్వ వైభవం తెప్పిస్తానని హామీ

నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ట్రాక్ పెట్టి .. పూర్వ వైభవాన్ని తెప్పించే బాధ్యత తీసుకుంటానని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జరుగుతున్న మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. 

Mahanadu 2023 : నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడి.. మళ్లీ ట్రాక్ లో పెట్టి .. పూర్వ వైభవాన్ని తెప్పించే బాధ్యత తీసుకుంటానని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జరుగుతున్న మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.  నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని హామీ ఇచ్చారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడమే టీడీపీ బలం అని.. ఈ నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ రౌడీలు.. ఖబడ్దార్.. జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు.