Mahapadayatra: వైకాపా నేతలు.. మూసుకొని కూర్చోండి.. పాదయాత్ర మహిళలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను బలిసిన పాదయాత్రగా అభివర్ణించిన వైకాపా నేతలకు పాదయాత్రలోని మహిళలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అవకాశం మేరకు సాయం చేయండి, లేదా మూసుకొని కూర్చోండి అంటూ హితవు పలికారు
Amaravati: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను ఒళ్లు బలిసిన పాదయాత్రగా అభివర్ణించిన వైకాపా నేతలకు పాదయాత్రలోని మహిళలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అవకాశం మేరకు సాయం చేయండి లేదా మూసుకొని కూర్చోండి అంటూ హితవు పలికారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మీడియా ద్వారా హెచ్చరించారు.
మహాపాదయాత్ర నేటికి 18వ రోజుకు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలం, కొవ్వలి నుండి 15కి.మీ మేర నేడు కొనసాగనుంది. పాదయాత్రకు స్ధానికులు, ప్రతిపక్ష పార్టీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. వైకాపా మినహా అన్ని వర్గాల నుండి స్పందన వస్తుండడంతో పాదయాత్ర ఉద్ధేశాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
వైకాపా మంత్రుల మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని మహిళా రైతులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానులంటూ కొత్త నాటకానికి తెరతీసారని తప్పుబట్టారు. ఒక్క రాజధానికే నిధులు లేవంటూ చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం, మూడు రాజధానులకు ఎక్కడ నుండి నిధులు సమకూరుస్తారో తెలియని స్థితిలో వారుండడం దురదృష్టకరమన్నారు. 30వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం అని నాడు జగన్ పేర్కొనడం నిజం గాదా అని ప్రశ్నించారు. మాట తప్పం, మడం తిప్పం అన్న మాటలకు అర్ధం ఏందో జగన్ కు తెలుసా అని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు 29 గ్రామాల కోసం కాదన్నారు. 5కోట్ల మంది ఆంధ్రుల అభివృద్ధి కోసం ఇచ్చామని వారు గర్వంగా చెపుతూ ఉద్యమ ఉద్ధేశానికే మేము కట్టుబడి ఉన్నామంటూ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లతున్నారు.
అమరావతి నుండి అరసవళ్లి వరకు పాదయాత్ర పార్ట్ 2 జరగనుంది. మొదట న్యాయస్ధానం టు దేవస్ధానం అంటూ తిరుమలకు అమరావతి రైతులు పాదయాత్రను చేపట్టివున్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడమే వారి ప్రధాన లక్ష్యం.
ఇది కూడా చదవండి: ఐఏఎస్ అధికారులను పంపండి ప్లీజ్.. రాష్ట్రాలకు కేంద్రం విన్నపం