Home / ఆంధ్రప్రదేశ్
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు.
పాపికొండల విహార యాత్ర ను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చినా బోట్లు మాత్రం కదలడం లేదు. ప్రభుత్వం యూజర్ చార్జీలు పెంచడమే దీనికి కారణమని తెలుస్తోంది.
మాజీ సర్పంచ్ సచివాలయం గుమ్మానికే ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.
కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీకి సీఎం జగన్ స్వాగతం పలకడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.