Home / ఆంధ్రప్రదేశ్
ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దంటూ ధర్మాసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలంటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనల నేపధ్యంలో లో ఏసీపీ మోహన్‌రావు పై సస్పెన్షన్ వేటు పడింది.
చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆలయ అధికారులు తెలిపారు.
కైకలూరులో విషాదం చోటుచేసుకొనింది. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైనాయి. బాధితులు ఇరువురు సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది.
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు.
మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలు అవతారం ఎత్తారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించిన ఉషశ్రీ చరణ్ 6వ తరగతి విద్యార్ధులకు పాఠాలు బోధించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు, 10,258.37 కేజీల బంగారం ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.