Last Updated:

First Private Rocket: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్.. అంతరిక్షం వరకు హైదరాబాద్ ఖ్యాతి

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ అయిన ‘విక్రమ్‌-ఎస్‌’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్‌ కంపెనీ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా 3 కస్టమర్‌ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.  

First Private Rocket: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్.. అంతరిక్షం వరకు హైదరాబాద్ ఖ్యాతి

First Private Rocket: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ అయిన ‘విక్రమ్‌-ఎస్‌’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్‌ కంపెనీ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’సిద్ధమైంది. ఈ రాకెట్‌ ద్వారా 3 కస్టమర్‌ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.

విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను చాలా తక్కువ కాలంలోనే తయారుచేసి ప్రయోగానికి సిద్ధం చేయగలిగామని స్కైరూట్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్‌ చందన పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు. ఇస్రోలోని లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా ఇటీవల బెంగళూరులో ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, ఇతర అధికారులతో సమావేశమై ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో దేశంలోనే తొలిసారి నింగిలోకి రాకెట్‌ను పంపిన ప్రైవేట్‌ కంపెనీగా ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ చరిత్ర సృష్టించనుంది. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటాల్‌ వాహకనౌక అయిన ‘విక్రమ్‌-ఎస్‌’ రాకెట్‌ ద్వారా 3 కస్టమర్‌ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు.

ఇకపోతే రాకెట్ల తయారీ ఖర్చును తగ్గించడం ద్వారా వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను సరసమైన ధరలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ స్కైరూట్. గతంలో రెండుసార్లు ఈ సంస్థ చేపట్టిన అత్యాధునిక ప్రయోగాలకు గానూ జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుంది. ఇదిలా ఉండగా ఇస్రోతో ఒప్పందం చేసుకున్న తొలి భారత స్టార్టప్‌ కంపెనీగా స్కైరూట్ నిలిచింది.

ఇదీ చదవండి: పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు

ఇవి కూడా చదవండి: