Papikondalu Boat Tourism: పాపికొండల విహార యాత్రకు కదలని బోట్లు..
పాపికొండల విహార యాత్ర ను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చినా బోట్లు మాత్రం కదలడం లేదు. ప్రభుత్వం యూజర్ చార్జీలు పెంచడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Papikondalu: పాపికొండల విహార యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చినా బోట్లు మాత్రం కదలడం లేదు. ప్రభుత్వం యూజర్ చార్జీలు పెంచడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఒకవైపు కార్తీకమాసం పిక్నిక్ లకు పోటెత్తుతున్న పర్యాటకులు మాత్రం దీని పై నిరాశ చెందుతున్నారు.
పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో అధికారులు సోమవారం గోదావరిలో ట్రయల్ ల్ రన్ సైతం నిర్వహించారు. మొదటి ట్రయగల్ రన్ సక్సెస్ కావడంతో పాపికొండల విహారయాత్ర ఇక షురూ అవుతుందన్న క్రమంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. గత కొద్దికాలంగా పాపికొండల యాత్ర నిర్వహించకపోవడం, పెరిగిన ధరల కారణంగా బోట్ యాజమాన్యాలు ఆర్దికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ప్రభుత్వం పెంచిన యూజర్ చార్జీలు కూడ వారికి భారంగా మారాయి. దీనితో పాపికొండల యాత్రకు అనుమతులుర వచ్చినా బోట్లు ముందుకు కదలలేదని తెలుస్తోంది. దీని పై పర్యాటకశాఖ అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించడానికి చొరవడచూపాలని పలువురు కోరుతున్నారు.