Home / ఆంధ్రప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నెల 12న విశాఖకు రానున్న ప్రధానమంత్రి మోది పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వైఎస్ఆర్సీపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబర్ 9 నాటికి నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన 10,52,326 ఓట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా తొలగించిన్నట్లు సీఈవో వెల్లడించారు.
జనసేన మరోసారి జగన్ సర్కార్‌పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది. అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రెండేళ్ల నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది.