Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ఇంటర్మీడియట్ చదువుతున్న తన సహచర విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరించి మరీ తనపై అఘాత్యాయికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలుగా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గుంటూరులో జరిగిన మైనారిటీ సంక్షేమదినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని అన్నారు.
వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న బాధలు ఓవైపు, మరో వైపు సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 365రోజుల పాదయాత్రకు రంగం సిద్ధమైంది
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా భేటీ కానున్నారు.