Home / ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెండురోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న 10కోట్ల రూపాయల ఆఫర్ గురించి మాట్లాడిన మాటలు మరువకముందే మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వైసీపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ దొంగ ఓట్లతోనే తాను గెలిచానని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు .. మరోవైపు సస్పెండ్ చేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలతో మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మేరకు తాజాగా వైసీపీ అధినాయకత్వంపై ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశాననేది నామీద బురద జల్లడమే అంటూ ఫైర్ అయ్యారు.
ఏపీలో రాజకీయాలు విమర్శలు.. ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మొదలైన ఈ ధోరణి.. ఇటీవల 4 వైకాపా ఏమమెలఎఎలను సస్పెండ్ చేయడంతో మరింత జోరందుకుంది. కాగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు.
CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
Mekapati Chandrashekar Reddy : వైకాపా నుంచి తనను సస్పెండ్ చేయటంతో తలపై భారం తొలగినట్లైందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. అధికారం ఉందన్న అహంకారంతోనే తనను పార్టీ నుంచి తొలగించారని ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సవ్యంగా లేదని, కొద్ది మంది పెత్తనమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘నేను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఈ విషయంపై దేవుడిపై ప్రమాణం చేస్తా.. […]
జగన్ సర్కార్ ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ ఈరోజు జమ చేయనున్నారు.
ఏపీ అసెంబ్లీ శుక్రవారం రెండు కీలక తీర్మానాలు ఆమోదించింది. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని ఒకతీర్మానం, దళిత క్రిష్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన 2 తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ అన్నారు.