Home / ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత చేగొండి వెంకట హరిరామ జోగయ్య రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ నిర్మాత గాను జోగయ్య సేవలు అందించారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈయన ఈరోజు 86 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా.. ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జనసేనను రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అడుగులు వేస్తామని పనవ్ అన్నారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను తాను పోగొట్టుకోవాలని అనుకోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజనల్ ఇన్ చార్జిలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు (సోమవారం) కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత హీట్ పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న క్రమంలో మాటల యుద్దానికి తెరలేపుతూ వారి వారి శైలిలో దూసుకుపోతున్నారు. ఇన్నాళ్ళూ ఎక్కువ సందర్భాలలో మాటలు, తక్కువ సమయాల్లో మాత్రమే గొడవలు,దాడులు చేసుకోవడం గమనించవచ్చు. అయితే ఇప్పుడు పార్టీల కోసం ప్రజలు లైన్ దాటేస్తునానరని అనిపిస్తుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.
చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.
Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అంతే కాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Duranto Express: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ బోలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది.
Chandrababu: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెదేపా 41న ఆవిర్భావ సభకు హాజరై.. ప్రసంగించారు.