Last Updated:

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు జారీ..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది.

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖ సమాచారం. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.