Former Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
Former Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.
నారాయణ కుమార్తెలకు నోటీసులు
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు వచ్చే నెల 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.
మరోసారి కలకలం సీఐడీ నోటీసులు(Former Minister Narayana)
కాగా, అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చంద్రబాఋ, నారాయణలపై కేసులు నమోదు చేశారు.
ఆ కేసుపై గతేడాది ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తునకు రావాలంటూ నోటీసులు అందజేయగా.. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే దళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థర్డ్ పార్టీ కింద కేసు నమోదు చేయడంతో.. ఈ అంశంపై దుమారం రేగింది.
రాజధాని అమరావతిలో సుమారు 169. 27 ఎకరాల అసైన్డ్ భూములను నారాయణ కొనుగోలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
నారాయణ సిబ్బంది, పనిమనుషుల పేర్లతో ఈ భూములు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరిగింది.
దీంతో సీఐడీ అధికారులు హైదరాబాద్ లో ని కొండాపూర్, గచ్చిబౌలి , కూకట్ పల్లిలోని నారాయణ కుమార్తెల నివాసాలు, బంధువలు ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో 2014, 2015లో అమరావతి ప్రాంతంలో జరిగిన అసైన్డ్ భూముల అక్రమ, బినామీ కొనుగోళ్లకు సంబంధించిన నిధుల ప్రవాహానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్లు..
ఏపీ సీఐడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
దీంతో రాజధాని భూముల వ్యవహారంలో మరోసారి కలకలం రేపుతోంది.