Last Updated:

Atchannaidu: రాష్ట్రం బొత్స జాగీరు కాదు.. అచ్చెన్నాయుడు

అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Atchannaidu: రాష్ట్రం బొత్స జాగీరు కాదు.. అచ్చెన్నాయుడు

Amaravati: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణ పై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం బొత్స జాగీరు కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొత్స తీరు పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర మంత్రులను దద్దమ్మలుగా అచ్చెన్నాయుడు పోల్చారు.

కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రకృతి ఇచ్చిన రుషి కొండను కూడా కాజేస్తున్న మీరా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేది అని ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ది చూపాలని డిమాండ్ చేశారు. 3 రాజధానుల పేరుతో డ్రామాలు, అభివృద్ధిని పాతాళంలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చేస్తానంటే నేను గాని, చంద్రబాబు గాని వద్దన్నామా? అని ఎదురు ప్రశ్న వేశారు.

అమరావతి రాజధానిగా పేర్కొన్న నాటి ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కొత్త నాటకానికి తెరతీసింది వాస్తవం కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడైన ఒక రాజధాని మాత్రమే ఉంటుందని, సాధించిన ఫలాలతో అభివృద్దిని రాష్ట్రం మొత్తానికి చెందేలా ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయన్నారు. అంతేగాని చేతకాని పాలనతో ఏపిని అంధకారంలోకి నెట్టిన ఘనుడు జగన్ కాదా అని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: న్యాయవాదుల కోసం పెట్టిన ఖర్చు ఎంత.. బొండా ఉమ

ఇవి కూడా చదవండి: