Bonda Uma: న్యాయవాదుల కోసం పెట్టిన ఖర్చు ఎంత.. బొండా ఉమ
పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120కోట్ల రూపాయలను రుసుము కింద చెల్లించాలని ఎన్జీటి తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన కేసు వాదనల సమయంలో న్యాయవాదులకు ఎంతమేర ప్రభుత్వం చెల్లించిందో అన్న అంశం పై నోటీసు ఇస్తామని పేర్కొన్న విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
Amaravati: పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120కోట్ల రూపాయలను రుసుము కింద చెల్లించాలని ఎన్జీటి తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన కేసు వాదనల సమయంలో న్యాయవాదులకు ఎంతమేర ప్రభుత్వం చెల్లించిందో అన్న అంశం పై నోటీసు ఇస్తామని పేర్కొన్న విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
తెలుగుదేశం నేత బొండా ఉమా న్యాయవాదుల ఖర్చు పై లెక్క చూపించాలని జగన్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎంతమేర ప్రజాధనంను న్యాయవాదుల కోసం ఖర్చు పెట్టారో తెలపాలన్నారు. ప్రజాధనం లూటీ పై జగన్ తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదించేందుకు చేపట్టిన ఖర్చుతో ఏం ప్రగతి సాధించారో పేపర్ రూపంలో తెలపాలని ఉమా పేర్కొన్నారు. కేవలం తన సొంత కేసుల కోసం న్యాయవాదులకు వందల కోట్లు చెల్లించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అన్ని శాఖలకు సంబంధించి న్యాయవాదుల ఖర్చు లెక్కలు విడివిడిగా చూపించాలని కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో తెలంగాణ నుండి చెందాల్సిన ఆస్తులు తెప్పించడంలో ప్రత్యేక న్యాయవాదులను నియమించారాని అని బొండా ఉమా ప్రశ్నించారు. కరెంటు బకాయిల పై ప్రత్యేక న్యాయవాదులతో ఎందుకు పోరాటం చేయలేదని వాదించారు. అసమర్ధ, చేతకాని దద్ధమ్మ సీఎం జగన్ కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా పై, రైల్వే జోన్ సాధించుకోవడంలో ఎందుకు న్యాయవాదులతో వాదనలు చేయించలేదన్నారు. తప్పుడు కేసులను వాదించేందుకు మాత్రం కోట్ల రూపాయలను ఖర్చుచేసి న్యాయవాదులకు ప్రజాధనంను ఇచ్చారని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులుగా ఉన్న వారేం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదండి: కాంగ్రెస్ అధ్యక్షపదవి రేసు నుంచి అశోక్ గెహ్లాట్ అవుట్