Published On:

Pawan Kalyan Launched ‘Adavitalli Path’: ఏపీ సర్కార్ సరికొత్త కార్యక్రమం.. నేటి నుంచి పవన్ కల్యాణ్ ‘అడవితల్లి బాట’

Pawan Kalyan Launched ‘Adavitalli Path’: ఏపీ సర్కార్ సరికొత్త కార్యక్రమం.. నేటి నుంచి పవన్ కల్యాణ్ ‘అడవితల్లి బాట’

AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Path” from Today: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ‘అడవితల్లి బాట’ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని పెదపాడుకు చేరుకుంటారు. అనంతరం పెదపాడులో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: