Last Updated:

KTR: టెన్త్ పేపర్ లీకేజీ ఘటన.. కేటీఆర్ పై కేసు నమోదు!

KTR: టెన్త్ పేపర్ లీకేజీ ఘటన.. కేటీఆర్ పై కేసు నమోదు!

10th Exam Paper Leaked Case has Been Registered EX Minister KTR: తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజీ ఘటన కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో నకిరేకల్ లో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ.. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత్, శ్రీనివాస్‌లు పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆయనపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.