Published On:

iPhone 15 Price Drop: తగ్గినప్పుడే కొనాలి.. ఐఫోన్ 15‌పై వేలల్లో డిస్కౌంట్.. లోపల చాలా ఉన్నాయ్..!

iPhone 15 Price Drop: తగ్గినప్పుడే కొనాలి.. ఐఫోన్ 15‌పై వేలల్లో డిస్కౌంట్.. లోపల చాలా ఉన్నాయ్..!

iPhone 15 Price Drop: దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ కొత్త ఫోన్ సెప్టెంబర్ 2025లో లాంచ్ కావచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌ను భారత మార్కెట్‌తో పాటు ఇతర దేశాల మార్కెట్లలో కూడా లాంచ్ చేయవచ్చు. అయితే, దీనికి ముందు, ఇప్పటికే ఉన్న మోడల్‌ను డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు డిస్కౌంట్‌తో ఐఫోన్ 16 కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ధరపై రూ. 5000 ప్రత్యక్ష తగ్గింపు ఇస్తున్నందున, దాన్ని కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం. భారీ తగ్గింపుతో ఐఫోన్ 15 ను ఎలా, ఎక్కడ నుండి కొనుగోలు చేయవచ్చో చూద్దాం..!

 

iPhone 15 Specifications
యాపిల్ ఐఫోన్ 15‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. దీనిలో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఫోటోగ్రఫీ కోసం 48MP + 12MP రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ A16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

 

iPhone 15 Discount Offers
ఐఫోన్ 15 128 GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం తగ్గింపుతో జాబితా చేశారు. మీరు దాని ధరపై రూ. 5000 ప్రత్యక్ష తగ్గింపు పొందచ్చు. ఎలాంటి ఆఫర్లు లేకుండానే, ఐఫోన్ 15 128GB వేరియంట్ ధర రూ.69,900కి బదులుగా రూ.64,900గా ఉంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత ఐఫోన్ 15 ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

 

iPhone 15 Bank Offers
బ్యాంక్ ఆఫర్‌ విషయానికి వస్తే మీరు iPhone 15 ధరపై అదనపు తగ్గింపు పొందచ్చు. నో కాస్ట్ EMI లావాదేవీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై మీరు 5శాతం వరకు తగ్గింపు పొందచ్చు. ఇది కాకుండా, మీరు ఇతర క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపుపై తగ్గింపును కూడా పొందచ్చు. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌పై రూ. 3000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.

 

iPhone 15 Exchange Offers
ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం అందుబాటులో ఉంటే, మీరు ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా డిస్కౌంట్ పొందచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా iPhone 15 పై రూ.48,150 ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందచ్చు. నిబంధనలు, షరతుల ప్రకారం.. ఎక్స్‌ఛేంజ్ చేస్తున్న ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. తాజా మోడల్ జాబితాలో కూడా ఉండాలి. ఇది కాకుండా, ఎంచుకున్న యాపిల్ ఐఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడంపై మీరు మరిన్ని ఎక్స్ఛేంజ్ తగ్గింపులను పొందచ్చు.

ఇవి కూడా చదవండి: