Last Updated:

Whatsapp spam calls: ఇక వాట్సాప్ స్పామ్ కాల్స్ కు చెక్ .. త్వరలో కొత్త ఫీచర్

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్పామ్ కాల్స్, మెసెజెస్ వస్తుంటాయి. అదీ కూడా సాధారణ కాల్స్ లనే వచ్చి విసిగిస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల స్పామ్ కాల్స్ ను గుర్తించడం కష్టం.

Whatsapp spam calls: ఇక వాట్సాప్ స్పామ్ కాల్స్ కు చెక్ .. త్వరలో కొత్త ఫీచర్

Whatsapp spam calls: పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్పామ్ కాల్స్, మెసెజెస్ వస్తుంటాయి. అదీ కూడా సాధారణ కాల్స్ లాగే  వచ్చి విసిగిస్తుంటాయి.

కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల స్పామ్ కాల్స్ ను గుర్తించడం కష్టం.

ఒక వేళ ఆ కాల్స్ ను బ్లాక్ చేసినా.. మళ్లీ వేరే నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి. దీంతో స్పామర్స్ నేరుగా వాట్సాప్ నెంబర్లకు ఫోన్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటి కాల్స్ కు చెక్ పెట్టేందుకు వాట్సాఫ్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది.

 

స్పామ్ కాల్స్ మ్యూట్ చేసేలా(Whatsapp spam calls)

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను మ్యూట్‌ చేసేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేలా వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.

‘సైలెన్స్ అన్ నోన్ కాలర్స్’ పేరిట ఈ ఫీచర్ వస్తోందని వాట్సాప్ బీటా నివేదిక తెలిపింది.

ఎవరైనా కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తే.. యూజర్ కు రింగ్ రాకుండా ఈ సరికొత్త ఫీచర్ అడ్డుకుంటుంది.

 

 

కేవలం నోటిఫికేషన్ మాత్రమే

అలాంటి కాల్స్ వచ్చినపుడు కేవలం నోటిఫికేషన్ మాత్రమే కనిపిస్తుంది. కాంటాక్ట్ లిస్ట్ లోని ఎవరైనా కొత్త వ్యక్తులు మనకు ఫొన్ చేసినపుడు రింగ్ అవ్వదు.

ప్రజెంట్ ఈ ఫీచర్ డెవలప్ మెంట్ రూపంలో ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇది అందుబాటులోకి తెస్తే యూజర్లను అసహనానికి గురి చేస్తున్న స్పామ్‌ కాల్స్‌ నుంచి సేఫ్ గా ఉండొచ్చు.

ప్రస్తుతం వాట్సాప్‌కు వచ్చే స్పామ్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ వాటిని సైలెంట్‌గా పెట్టుకునే వీలు లేదు.

ఇప్పుడు ఆ ఫీచర్‌పైనే వాట్సాప్ దృష్టి పెట్టినట్టు వాట్సాప్‌ బీటా ఇన్ఫో పేర్కొంది.

కాల్ షెడ్యూలింగ్

ఇక ఇప్పటికే వాట్సాప్ కూడా కాల్ షెడ్యూలింగ్ ను యూజర్లకు పరిచయం చేసింది. వాట్సాప్ వేదిక గా ఎక్కువగా ఆన్ లైన్ కార్యక్రమాలు నిర్వహించే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను ముందుగా బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో లేదా వీడియో కాల్ వెళ్లాలో ముందుగానే ఈ కొత్త ఫీచర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.

వీడియో, ఆడియో కాల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే షెడ్యూల్‌ కాల్ అని పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. అందులో మీటింగ్ పేరు, తేదీ, సమయం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.

వివరాలన్నీ ఇచ్చిన తర్వాత క్రియేట్ పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది.

కాల్ ప్రారంభమవ్వగానే గ్రూప్ లోని మెంబర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి.

వాట్సాప్ ప్రతి ఏడాది అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఫ్యూచర్ లో వాట్సాప్ లో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.