Kanguva: సూర్య ‘కంగువ’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఇదే – డిజిటల్ రైట్స్ ఎంతో తెలుసా?
Kanguva OTT Partner and Digital Rights: తమిళ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువ’ భారీ అంచనాల మధ్య ఇవాళ (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్‌టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మొత్తం కంగువా గురించి మాట్లాడుతూ. సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు మూవీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సూర్య పర్ఫామెన్స్, యాక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మొత్తానికి సినిమా ఫస్ట్‌షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్, స్ట్రీమింగ్ డిటైయిల్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి థియేటర్లో విడుదలైన ఏ చిత్రమైన ఓటీటీకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెల రోజుల్లోనే ప్రీమియర్‌కు వస్తుంటే.. మరికొన్ని నెలల సమయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో కంగువ ఓటీటీ ప్లాట్‌ఫాం, స్ట్రీమింగ్ డిటైయిల్స్ ఓసారి చూద్దాం.
కంగువ సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడంతో మొదటి దీనిపై ఓ రేంజ్ బజ్ ఉంది. దీంతో మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అలాగే ఓటీటీ డీల్స్ కూడా భారీ మొత్తం జరిగినట్టు తెలుస్తోంది. విడుదలకు ముందే కంగువ ఓటీటీ ఢిల్ పూర్తయినట్టు తెలుస్తోంది. కంగువ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 100 కోట్లకు ఓటీటీ డీల్ జరిగిందని సమాచారం. ఇక మూవీ థియేట్రికల్ రన్ అనంతరం స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
అయితే ఇది మూవీ ఫలితం బట్టి కూడా సినిమాకు డిజిటల్ ప్రిమియర్‌కు తీసుకువచ్చేలా కూడా ఒప్పందం చేసుకుందట అమెజాన్ ప్రైం. ఈ లెక్కన మూవీ రిలీజైన రెండు నెలలకు ఓటీటీకి రావచ్చు. లేదా మూవీకి వచ్చే రెస్పాన్స్ బట్టి అంతకంటే ముందే స్ట్రీమింగ్ రావచ్చు లేదా మరింత ఆలస్యమైన కావచ్చు. డిసెంబర్‌లో లేదా జనవరిలో కంగువ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషించారు.