Last Updated:

Nitish Kumar Resignation: సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్

నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను రాజ్ భవన్‌లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు

Nitish Kumar Resignation: సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్

Bihar: నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను రాజ్ భవన్‌లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు.

ఈ రోజు మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎన్డీఏ నుండి వైదొలగాలని అందరూ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించి బీహార్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఉన్న సీఎం పదవికి రాజీనామా చేశాను అంటూ నితీష్ కుమార్ మీడియా కు తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడంతో మహాఘట్బంధన్ కు మార్గం సుగమమైంది. తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ ను కలిసే అవకాశముంది. మళ్లీ ముఖ్యమంత్రిగా కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజశ్వి యాదవ్ ఉంటారని సమాచారం. తమకు హోం శాఖ ఇవ్వాలంటూ ఆర్జేడీ కోరుతోంది. మంత్రివర్గ కూర్పు పై ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కలిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: