Last Updated:

NEET Paper Leak: పరీక్షకు ఒక రోజు ముందు నీట్‌ పేపర్‌ లీక్‌!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.

NEET Paper Leak: పరీక్షకు ఒక రోజు ముందు నీట్‌ పేపర్‌ లీక్‌!

NEET Paper Leak:  ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ నీట్‌ పరీక్షకు సంబంధించి కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నీట్‌ పరీక్షకు ఒక్క రోజు ముందు రాత్రి పీపేర్‌ లీక్‌ అయ్యిందని వారు అంగీకరించారు. దీంతో పాటు గత వారం నేషనల్‌ ఎలిజిబిలిటీ – కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పరీక్ష పేపర్‌ లీక్‌ పై విద్యార్థులు పెద్దత్తున నిరసన చేపట్టారు. దీంతో పాటు 1,500 మందికి గ్రేస్‌ మార్కులు ఇవ్వడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత గ్రేస్‌ మార్కులను ఉపసంహరించారు. వారికి తిరిగి పరీక్షలు నిర్వహించారు. ఇంత జరిగినా.. విద్యాశాఖ మంత్రి మాత్రం ఏలాంటి లీక్‌లు జరగలేదని వాదించడం మొదలుపెట్టారు.

అరెస్టయిన నలుగురు బిహార్ వ్యక్తులే.. (NEET Paper Leak)

ఇక అరెస్టు అయిన నలుగురు వ్యక్తుల విషయానికి వస్తే అంతా బిహార్‌కు చెందిన వారే. వారిలో నీట్‌ పరీక్ష రాస్తున్న అనురాగ్‌ యాదవ్‌, సికందర్‌ యాదవేందు, దానపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కు చెందిన ఓ జూనియర్‌ ఇంజినీర్‌, ఆయనతో పాటు మరో ఇద్దరు నితీష్‌కుమార్‌, అమిత్‌ ఆనంద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో తమకు పరీక్షకు ఒక్క రోజు ముందు పరీక్షా పత్రం అందిందని.. ప్రశ్నలను బట్టి పట్టామని చెప్పారు. ఇక నీట్‌ పరీక్ష రాసిన అనురాగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పేపర్‌ చేతికి అందాక రాత్రంతా ప్రశ్నలకు సంబంధించి జవాలను బట్టి పట్టామన్నారు. తీరా మరుసటి రోజు పరీక్ష రాసేందుకు వెళ్లినపపుడు అదే పేపర్‌ వచ్చిందని.. తాను బట్టి పట్టిన జవాబులన్నీ ఖచ్చితంగా సరిపోయాయయని చెప్పారు. పరీక్ష అయిపోయాక పోలీసులు వచ్చిన తనను అరెస్టు చేశారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించానని చెప్పాడు అనురాగ్‌ యాదవ్‌.

ఇక యాదవేందు విషయానికి వస్తే ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నేరస్తులు నితీష్‌కుమార్‌, అమిత్‌ ఆనంద్‌లు తనతో సంప్రదింపులు జరిపారని.. ఎలాంటి కాంపిటీటివ్‌ పరీక్షలైన నీట్‌ పరీక్షల పేపర్‌ అయినా కావాలంటే పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.30 నుంచి 32 లక్షలు ఇస్తే పేపర్‌ తెచ్చి ఇస్తామని చెప్పారని యాదువేంద చెప్పారు. దీనికి తాను అంగీకరించానని..తాను నలుగురు విద్యార్థులతో మాట్లాడి చెబుతానని నితీష్‌, అమిత్‌ ఆనంద్‌కు చెప్పానన్నాడు. తాను నలుగురిని నితీష్‌కుమార్‌, ఆనంద్‌ దగ్గరికి ప్రశ్నాపత్రం కోసం వారిని తీసుకువెళ్లాను. అయితే ప్రతి విద్యార్ధి నుంచి రూ.30 లక్షల బదులు రూ.40 లక్షలు వసూలు చేశానని యాదవేందు పోలీసుల ముందు వాస్తవాలు చెప్పాడు.

కాగా ఈ ఏడాది మే 5న జరిగిన నీట్‌ -యుజి పరీక్షను 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. అయితే ఫలితాలు మాత్రం షెడ్యూలు కంటే పది రోజుల ముందే వెల్లడయ్యాయి. అటు తర్వాత పేపర్‌ లీక్‌తో పాటు సుమారు 1,500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలిపారని పెద్ద గందరగోళం జరిగింది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ఎత్తుకొని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించింది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ, బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేపర్‌ లీక్‌లకు కేంద్ర బిందువు అని ఆరోపించారు. అయితే గత వారం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలను ఖండించారు. పేపర్‌ లీక్‌ అయ్యిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రతిపక్షాలు కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ప్రత్యారోపణ చేశారు.

ఇవి కూడా చదవండి: