Last Updated:

Mohan Lal: ‘కన్నప్ప’ నుంచి మోహన్‌ లాక్‌ లుక్‌ వచ్చేసింది – ఆయన పాత్రేంటో తెలుసా?

Mohan Lal: ‘కన్నప్ప’ నుంచి మోహన్‌ లాక్‌ లుక్‌ వచ్చేసింది – ఆయన పాత్రేంటో తెలుసా?

Mohan Lal Look from Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 24 ఫ్రేమ్స్‌ బ్యానర్‌లో మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. సుమారు రూ. 100 పైగా కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన అగ్రతారాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మోహన్‌ బాబు లుక్‌, పాత్ర పేరు రిలీజ్‌ చేశారు. అయితే ఇందులో ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి స్టార్స్‌ నటిస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. కానీ అసలు కన్నప్పలో వారి లుక్‌, పాత్రలేంటనేది మాత్రం వెల్లడించారు. వారి రోల్స్ గురించి తెలుసుకునేందుకు అభిమానుల ఆసక్తిగా ఎదురచూసతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్‌ లాల్‌ రోల్‌ని పరిచయం చేసింది కన్నప్ప టీం.

ఇందులో ఆయన ‘కిరాత’ అనే పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఆయన లుక్‌కి సంబంధించి పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. “పాశుపతాస్త్ర ప్రదాత! విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత” అంటూ ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో వెల్లడించారు. పోస్టర్‌లో భయంకరమైన గిరిజన అవతారంలో మోహన్ లాల్ కనిపిస్తుండగా, ఆయన పాత్రలో దైవత్వం, గొప్పతనం రెండూ ఉంటాయని మేకర్స్ రాసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.