Raksha Bandhan: ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.

Hyderabad: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. అయితే హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. పండుగ రోజు డ్యూటీ ఉండటంతో తోబుట్టువులకు దూరంగా ఉన్న తనకు కేంద్ర మంత్రి భార్య రాఖీ శుభాకాంక్షలు తెలపడంతో కానిస్టేబుల్ భావోద్వేగానికి గురయ్యారు.