Marredpally Si Vinay Kumar: మారేడుపల్లి ఎస్ఐ పై బ్లేడ్ తో దాడి
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు.

Hyderabad: సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఎస్ఐని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎస్ఐ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిందితులు యాప్రాల్కు చెందిన టమాటా పవన్, సంజయ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.