పవన్ కళ్యాణ్: వైసీపీ గాడిదలకు భయపడనమ్మా.. మాటల్లేవ్.. అరుపులు కేకలే..
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. సత్తెనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్ కల్యాణ్ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీకెండ్ పొలిటీషియన్ అని తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అనంతరం మీరు చేసే దోపిడి ఎంత అని వైకాపా ను విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే క్రాప్ హోలిడే ప్రకటిస్తారు. కానీ ఏం జగన్ కరప్షన్ హోలీడే ప్రకటించారని అన్నారు. ఈ మేరకు తన ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ మళ్ళీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చే వరకు … కొంత కాలం అవినీతిని ఆపమని సూచినలిచ్చారని అలాంటి ప్రభుత్వం వైసీపీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అదే విధంగా నేను ఏమైనా మాట్లాడితే వైసీపీ గాడిదలు అంతా విమర్శించడమే పనిగా పెట్టుకుని వస్తారని అన్నారు. వైసీపీ కాపు నాయకులంతా కావాలని వచ్చి మాట్లాడతారు అని. తాను ఒక కులానికి కట్టుబడి ఉండే వాడిని కాదని.. గుర్రం జాషువాని స్పూర్తిగా తీసుకొని… అంబేద్కర్ ని ఆశయాలను అనుసరించే వాడిని అని అలాంటి తనకు కులాన్ని ఆపాదించడం పట్ల మండిపడ్డారు. తనను తిట్టే వైసీపీ గాడిదలకు ఒకటే చెప్తున్న అని… మీ నుంచి మాటలు రావట్లేదు, కేవలం అరుపులు , కేకలు మాత్రమే వస్తున్నాయని అన్నారు. ఆ గాడిద అరుపులకు తాను భయపడనని స్పష్టం చేశారు.