Last Updated:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

Road Accident: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్దకు రాగానే ఆదుపు తప్పి ఆటో బోల్తా పడింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడం వల్ల నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి: