Last Updated:

KCR: మరో యాగం చేయనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు.

KCR: మరో యాగం చేయనున్న సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. 13, 14 తేదీల్లో నిర్వహించనున్న రాజశ్యామల యాగంలో కేసీఆర్ పాల్గొంటారు. 14న బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాట్లను మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్ పరిశీలించారు.

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. దేశం కోసం కేసీఆర్ అనే నినాదంతో.. ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందించిన తమ అభిమాన నేత కేసీఆర్.. దేశాన్ని సైతం ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశం కోసం కేసిఆర్ అంటూ నినాదంతో ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ వీటిని ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందించిన తమ అభిమాన నేత కేసిఆర్ దేశాన్ని సైతం ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్న వేళ తాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి: