Last Updated:

TGPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడే గ్రూప్‌-2 ప్రాథమిక కీ విడుదల

TGPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడే గ్రూప్‌-2 ప్రాథమిక కీ విడుదల

TGPSC will releasing Group-2 Exam Key today: గ్రూప్‌-2 ప్రాథమిక కీ శనివారం విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు.

ఈ క్రమంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా తెలపాలని టీజీపీఎస్సీ వెల్లడించింది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 1,368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా, గ్రూప్-2 పరీక్షకు 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.