Karti Chidambaram: ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు.
Chennai: కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన లండన్ నుంచి చెన్నై తిరిగి రావడంతో సీబీఐ అధికారులు ఆ గదిలో సోదాలు నిర్వహించారు. అయితే ఈ దాడులకు సంబంధించి సీబీఐ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే సీబీఐ అధికారులు ఏ కేసుకు సంబంధించి దాడులు ఎందుకు చేశారనేది తెలియదు. ఇటీవలే ఆయన పై లంచం తీసుకొని వీసాలు ఇప్పించాడన్న కేసు నమోదయ్యింది. వీసా కేసుకు సంబంధించి ఈ ఏడాది మే 17వ తేదీన సీబీఐ కార్తీ చిదంబరం ఆడిటర్ ఎస్ భాస్కర రామన్‌ను అరెస్టు చేసింది. కాగా చిదంబరబంతో పాటు ఇతరులపై యూపీఏ -2 ప్రభుత్వంలో లంచం తీసుకొని 250 వీసాలు జారీ చేశారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు.