Home / Chennai
Kollywood: సీనియర్ నటుడు కమల్ హాసన్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై రజనీకాంత్ మాట్లాడారు. ఎస్. వెంకటేశన్ రచించిన వేల్పారి పుస్తకానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ పుస్తకంపై గాఢమైన అభిమానం వ్యక్తం చేసిన రజనీకాంత్.. అందరినీ ఆత్మీయంగా అలరించారు. ‘ఇలాంటి […]
ED Raids on actress Mucharla Aruna Residence: అలనాటి నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఆమె ఇంటిలో తనిఖీలు జరిగాయి. అరుణ భర్త మోహన్గుప్తా వ్యాపారాలకు సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో దాడులు జరిగినట్లు సమాచారం. మోహన్గుప్తా ఇంటీరియర్ డిజైన్, నివాస నిర్మాణ ప్రాజెక్టులు చేసే సంస్థను నిర్వహిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీని ఆధారంగా సోదాలు జరిపినట్లు […]
Thug Life: సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైప్ మూవీ కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్ బిజీబిజీగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన మూవీ ప్రమోషన్ లో భాగంగా కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శివరాజ్ ను ఉద్దేశిస్తూ.. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని అనడంతో కర్నాటక వాసులు తీవ్ర ఆగ్రహం […]
Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. […]
Sivaji Ganesan House Seized: నడిగర్ తిలగం, మహానటుడు శివాజీ గణేశన్ ఇంటినిక జప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన మనవడు దుష్యంత్ (శివాజీ గణేశన్ పెద్ద కుమారుడు రామ్ కుమార్ కొడుకు) చేసిన అప్పును తీర్చలేకపోవడంతో ఆయన ఇంటిని జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మహానటుడు శివాజీ గణేశన్ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని జప్తు చేస్తుండటంతో ఆయన అభిమానులు వాపోతున్నారు. కాగా ఆయన మనవడు దుష్యంత్ తన […]
మన దేశంలో ఆమ్ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్తో నడుపుతూ... కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్సైకిల్ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
తమిళనాడులో 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్నులింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆమె మాజీ క్లాస్మేట్ ఆమెను గొలుసుతో కట్టి, బ్లేడ్తో గాయపరిచి సజీవ దహనం చేసిందని పోలీసులు తెలిపారు.చెన్నైలోని కేలంబాక్కం సమీపంలోని తలంబూర్లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టించినరెండు రోజుల తరువాత కూడా తమిళనాడు రాజధాని చెన్నై మరియు దాని శివారు ప్రాంతాలలో నిలిచిపోయిన నీరు మరియు విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ తీగలు నీటిలో ఉన్నందున ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
మిచౌంగ్ తుఫాను కారణంగా సంభవించిన వర్షాలకు చెన్నైలో ఎనిమిది మంది మరణించారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులుగా మారాయి, వాహనాలు కొట్టుకుపోవడంతో విద్యాసంస్థలను మూసి వేయాల్సి వచ్చింది.